విధులు
కైరూన్ మస్జిద్ లేదా ఉక్బా మస్జిద్ పశ్చిమ ముస్లిం ప్రపంచంలో అతిప్రాచీన మస్జిద్.[1] ప్రార్థనా హాలు యందు, మిహ్రాబ్, ఖిబ్లాను సూచిస్తోంది.
అల్లాహ్ యొక్క ఉపాసన కొరకు ఖచ్చితంగా పాటించవలసిన నమాజ్ కొరకు క్రింది మూడు విషయాలు దృష్టిలో వుంచుకోవాలి :
ముస్లిం (విశ్వాసి) అయి వుంటే మంచిది.
మానసికంగా ఆరోగ్యవంతుడై వుండాలి
10 సంవత్సరాలు నిండినవారై వుండాలి (7 సంవత్సరాలు కనీస వయస్సు వుండాలి).[3]
నమాజ్ ఆచరించడానికి ఆరు మూల విషయాలు గుర్తుంచుకోవాలి :[2]
నమాజు సమయపాలన వుండాలి.
ఖిబ్లా వైపు ముఖం వుంచి, శరీరము కాబా వైపున వుంచి నమాజు ఆచరించాలి. అనారోగ్యులు, ముసలివారికి ఈ విషయంలో మినహాయింపు ఉంది.
శరీర భాగాలను బాగా కప్పుకోవాలి.
దుస్తులు, శరీరం, సజ్దాచేయు ప్రదేశం పరిశుభ్రంగా వుండాలి.
ఆచార శుద్ధత, వజూ, తయమ్ముం, గుస్ల్,
ప్రార్థన ఆచరించే ముందు ప్రదేశం ద్వారా ఎవరూ నడిచేప్రదేశం లేకుండా వుంచడం, అనగా నమాజీ ముందు నుండి ఎవరూ రాకపోకలు చేయరాదు, అలా చేస్తే ప్రార్థనా నిష్ఠ భంగమౌతుంది.[6] .
ప్రార్థనా స్థలి పరిశుభ్రంగా వుండాలి. ఒకవేళ గాయాల కారణంగా శరీరం నుండి రక్తము ప్రవహిస్తూ వుంటే నమాజ్ ఆచరించరాదు. స్త్రీలు తమ ఋతుకాలములో నామాజ్ ఆచరించరాదు. అలాగే స్త్రీలు బిడ్డల ప్రసవించిన తరువాత ఒక నియమిత కాలం, ఉదాహరణ 40 రోజులవరకు నమాజ్ ఆచరించరాదు. ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు "స్త్రీలు తమ ఋతుక్రమకాలంలోనూ, ప్రసవించిన తరువాత కొద్ది కాలం కొరకునూ నమాజు గాని ఉపవాసవ్రతంగానీ ఆచరించరాదు.
నమాజ్ లో ఆచరణీయాలు


